కేసీఆర్ పై ఈటెల సంచలన వ్యాఖ్యలు…. ఆరిపోయే దీపం అంటూ…

హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ పార్టీతో పాటు ఈటెల రాజేందర్ జోష్ మీద ఉన్నారు. సందు దొరికితే టీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధింస్తున్నారు. తాజాగా మరోసారి ఈటెల రాజేందర్, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి తిరుగు లేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

cm kcr etela rajender

తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఈటెల.. కరీంనగర్ లో టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్.. ఎమ్మెల్సీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని  ఈటెల వెల్లడించారు. కరీంనగర్ టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.