భార్యభర్తల మధ్య కలతలు రావడానికి ఇవే ప్రధాన కారణాలు..!!

-

భార్యభర్తల: భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం.. కానీ ఈరోజుల్లో.. ఏ జంటను తీసుకున్నా.. ఏదో ఒక లొల్లి.. ఒకప్పటితో పోలిస్తే విడాకుల కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. భార్యభర్తలు అంటే.. ఒకే మాటగా నడవాలి..ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించాలి.. విలువ ఇచ్చిపుచ్చుకోవాలి.. కానీ ఎందుకు భార్యభర్తల మధ్య గొడవులు జరుగుతున్నాయి.. దీనికి డబ్బు మాత్రమే కారణం కాదు..ఎందుకంటే.. ఆర్థికంగా బలంగా ఉన్నవారి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి.. దీనిపై నిపుణులు ఏం అంటున్నారో తెలుసా..?

 

ఆలుమగలుగా ఇద్దరి అభిరుచులు, ఆలోచనల్లో కొన్ని తేడాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వాదోపవాదాలకుతావివ్వకుండా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తే సమస్యలకు పరిష్కారం లభించినట్లే అంటున్నారు మానసిక నిపుణులు. పెళ్లయ్యాక కూడా ఎవరికివారు తమకంటూ కొంత స్పేస్ ఇచ్చుకోవాలి. అలానే కొన్ని నిర్ణయాలను స్వేచ్ఛగా నిర్భయంగా వెల్లడించగలగాలి. అయితే అవి మరీ ఒంటెద్దు పోకడల్లా ఉండకూడదు.. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచకూడదు.. ఒక విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. తమదే కరెక్ట్ అని వాదించాల్సిన పరిస్థితి వస్తే మధ్యే మార్గంగా చర్చలకు అవకాశం కల్పించాలి. అప్పుడు ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. ఎప్పుడూ నీదే కరెక్టు.. తను తప్పుగానే ఆలోచిస్తాడు అనే భావన ఉండొద్దు.. కొన్నిసార్లు నీ తప్పు లేకున్నా.. తగ్గాలి.

పెళ్లికి ముందు వరకు మీ ఇద్దరి జీవితాలు వేరు.. అప్పుడు ఏమైనా జరిగి ఉండొచ్చు..చిన్న విషయమే అయినా దాపరికం ఎదుటివారిలో అభద్రతను పెంచుతుంది. అందుకే ఇద్దరు వీలైనంత పారదర్శకంగా నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి.. అబ్బాయిలు బ్రాడ్‌ మైండ్‌తో ఆలోచించగలగాలి.. మీ భాగస్వామికి పెళ్లికి ముందే వేరే అబ్బాయితో రిలేషన్‌ ఉండి..కొన్ని కారణాల వల్ల అది కట్‌ అయితే.. మీరు గతాన్ని గడ్డపారతో తవ్వకండి. ఇప్పుడు మీతో ఎంత ప్రేమగా, ఎంత నిజాయితీగా ఉంటుంది అనేది మాత్రమే మీరు ఆలోచించగలగగాలి.. పెళ్లికి ముందు మీరు స్వేచ్ఛావాదులు.. ఎవరితో అయినా కమిట్‌ అయ్యే హక్కు మీకు ఉంటుంది. దాన్ని బూతద్దంలో పెట్టి పెద్ద తప్పుగా చిత్రీకరించకండి.

ముఖ్యంగా మీ భాగస్వామిని ఇతరులతో పోల్చి చూడడం చిన్న పొరపాటుకు కూడా పదేపదే ఎత్తి చూపడం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు సరికదా ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఇద్దరి అభిప్రాయాలను ఇబ్బందులను సూటిగా స్పష్టంగా చెప్పగలిగితే సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు అంటున్నారు.

భార్యాభర్తల్లో కొందరు భాగస్వామి తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాధపడుతుంటారు. అయితే అందరూ ఒకేలా భావాల్ని వ్యక్తపరిచలేరని మీరు అర్థం చేసుకోవాలి. మిగిలిన సందర్భాలు ఎలా ఉన్నా పెళ్లి రోజు, పుట్టినరోజు వంటి వాటిని ఎక్కడైనా నోట్ చేసుకుని విష్ చేస్తే చాలు.. వారి ఒత్తిడి అపోహలు, అపార్థాలు తొలగి సంతోషంగా జీవితం సాగిపోతుందని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

ప్రేమ చూపించడం అంటే బుజ్జి, బంగారం అంటే సరిపోదు.. వాళ్ల మనసులో ఏముందే అడగకముందే తెలుసుకోవాలి. వాళ్లకు మీ అవసరం ఉన్న ప్రతిసారీ మీరు తనతోనే ఉండగలగాలి. పదిమందిలో మీ భాగస్వామి నిర్ణయానికి విలువ ఇవ్వాలి. మీరే మీ భాగస్వామికి విలువ ఇవ్వకపోతే..ఇక ఇతరులు ఎలా ఇస్తారు.. నా భర్త/ నా భార్య నా నిర్ణయాలను గౌరవిస్తుంది అనే భావన ఇందరిలో ఉండాలి. అలా ఉండాలంటే.. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం, వారి ఇష్టాఇష్టాలపై అవగాహన ఉండాలి. నచ్చకపోతే నో చెప్పండి.. కానీ పదే పదే కాదు.. దాని వల్ల మీకు మరీ ఇబ్బందిగా ఉంది.. భరించలేరు అనే ఏ విషయమైన ధైర్యంగా నో చెప్పండి..అప్పుడే మీ వైహహిక జీవితంలో కలతలు రాకుండా ఆనందంగా ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news