వాస్తు: మానసిక ఒత్తిడిని ఇలా దూరం చేసుకోండి..!

వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని పండితులు చెప్తున్నారు. చాలా మంది మానసిక ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి కనుక వాటిని పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం అని పండితులు చెప్తున్నారు. అయితే ఈ టిప్స్ ని కనుక పాటించారు అంటే కచ్చితంగా మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండి ఆరోగ్యంగా, అందంగా ఉండడానికి వీలు అవుతుంది అని చెప్పడం జరిగింది.

అయితే మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. వాస్తుని పాటించడం వల్ల నిజంగా మంచి కలుగుతుంది. అలానే ఏదైనా సమస్య ఉంటే మనం పరిష్కరించుకోవచ్చు. అయితే వాస్తు ప్రకారం మానసిక ఒత్తిడిని తగ్గించుకుని పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవాలంటే రాత్రిపూట తినేసిన సామాన్లు కడక్కుండా ఉంచకూడదు.

అలానే సాయంత్రం పూట భోజనం చేయకూడదు. అదే విధంగా ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే కచ్చితంగా సాంబ్రాణి పొగ కానీ ధూప్ స్టిక్ వంటి వాటిని వెలిగించడం మంచిది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే వెండి గ్లాసులో రోజుకి నీళ్ళు ఒకసారి తాగండి అదే విధంగా బెడ్రూమ్ లో ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోకూడదు. నిజంగా ఈ తప్పులు చేయకుండా ఉంటే కచ్చితంగా ఒత్తిడి ఉండకుండా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా ఫాలో అయ్యి మానసిక ఒత్తిడిని దూరం చేసుకోండి.