లక్ష్మీ దేవి ఇంట్లోకి రావాలంటే ఇలా శుభ్రం చెయ్యాలి..

-

లక్ష్మీ దేవి కటాక్షం ఉంటే సిరి సంపదలు ఆ ఇంట్లో బాగుంటాయని అంటున్నారు. ఆమె అనుగ్రహం లేకుంటే మాత్రం ఎన్ని డబ్బులు వచ్చినా ఉండవు. అయితే చిన్న చిన్న పొరపాట్లు మాత్రం చేయకూడదు..అలా చెయ్యడం వల్ల అమ్మవారికి కోపం వస్తుంది..ముఖ్యంగా లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించాలి అంటే ఏం చేయకూడదు.. ఏం చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ప్రతి రోజూ మనం ఇంటిని చీపురుతో ఊడ్చి, తడి గుడ్డతో తుడిచి శుభ్రం చేస్తాం. ఎందుకంటే.. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి మనల్ని అనుగ్రహించాలంటే.. ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఓ సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ఇంటిని శుభ్రం చేస్తే.. లక్ష్మిదేవి మీ ఇంటికి నడిచి వస్తుందని అంటున్నారు జ్యోతిష్య పండితులు..

ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవి కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది..ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.ఎవరైనా తమ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ప్రధాన ద్వారం నుంచి మొదలెట్టి మొత్తం శుభ్రం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచే ఇంట్లోకి వస్తుంది. అలాగే ఉదయం సమయంలోని బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడూ ఇంటిని ఊడ్చవద్దు. సూర్యాస్తమయం, తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు.సూర్యాస్తమయం తర్వాత శుభ్రం చేయవలసి వస్తే.. చెత్తను మాత్రం ఎప్పుడూ బయట పడేయొద్దని వాస్తు పండితులు సూచిస్తున్నారు. పొరపాటున అలా చేస్తే.. ఇంటిలో ఉన్న లక్ష్మీ దేవీ కూడా బయటకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

ఇంట్లోని ప్రతి మూలను, ఫర్నీచర్ కింద కనిపించే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మూలల్లో దేవతలు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. కేవలం ఇంటిని శుభ్రంపరిస్తే సరిపోదు.. ఇంట్లోని బాత్‌ రూమ్‌లు, టెర్రస్, బాల్కనీని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.ఇంటిని ప్రతిరోజూ తడి బట్టతో తుడవకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మాత్రమే ఇంటిని శుభ్రపరచాలి..ఆ రోజుల్లో చెయ్యడం వల్ల మిగిలిన దోషాలు కూడా పోతాయి.. ఇది ఈ విషయాలను గుర్తు పెట్టుకోని ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news