Vastu tips: చాలామంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలామంది బుద్ధ విగ్రహాలని ఇల్లు లేదా ఆఫీసులో లేదా షాపుల్లో పెట్టుకుంటూ ఉంటారు. కేవలం గిఫ్ట్ గా మాత్రమే పొందాలని, సొంతంగా కొనుగోలు చేసి పెట్టకూడదని చెప్తారు. కానీ అది అపోహ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉత్తర దిక్కుని పెట్టుకోవడం చాలా మంచిది. ఈ దిశలో హాల్ ఉన్నట్లయితే అందులో ఎక్కడైనా ఈ విగ్రహాన్ని పెట్టండి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సంపద కూడా లభిస్తుంది.
ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి కుటుంబ కలహాలు కూడా రావు. అలాగే అదృష్టం కోసం ఎరుపు రంగు అన్వేలోప్ పెట్టుకుంటే చాలా మంచిది. అదృష్టాన్ని తీసుకువస్తుంది, ఏ పని చేసినా విజయాన్ని అందుకోవచ్చు. ఎరుపు రంగు అన్విలోప్ ఇంట్లో పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి హాయిగా ఉండవచ్చు. మనీ ప్లాంట్ లేదా బాంబు ప్లాంట్ ఇంట్లో ఉంటే కూడా మంచి జరుగుతుంది.
ఇవి కూడా ఇంట్లోకే చక్కటి పాజిటివ్ ఎనెర్జీని తెచ్చి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. డబ్బు వచ్చేటట్టు చేస్తాయి. కాబట్టి వీటిని కూడా ఇంట్లో పెట్టుకోండి అలాగే ఇంట్లో ఈవిల్ ఐ లాకెట్ లని పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఉత్తర ఆఫ్రికా మధ్య, తూర్పు దేశాల్లో కొంతమంది ఈవిల్ ఐ అని పిలవబడే ప్రత్యేకమైన లాకెట్స్ లేదా పెండెంట్స్ ని ఇళ్లలో పెడతారు ఇది ఉండడం వలన దిష్టి పోతుంది మన ఇంట్లో వారిపై దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది.