వాస్తు: ఇంట్లో కామధేనువు విగ్రహం ఎక్కడ ఉంచితే మంచిదో తెలుసా?

-

వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు.అప్పుడే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని అంటున్నారు…ఇంట్లో లేదా కార్యాలయంలో కోరికలు తీర్చే విశ్వ గోవు అయిన కామధేను విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. హిందూమతంలో గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. గోమాతలో సకల దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. గోమాతను పూజిస్తే సకల దోషాలు పరిహారం అవుతాయని విశ్వసిస్తారు. ఇక అటువంటి గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సుఖ శాంతులు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 

కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఉంచడానికి మీ ఇంటికి ఈశాన్య దిశను అనువైన ప్రదేశంగా చెబుతున్నారు. సహజంగా ఈశాన్య దిశలో ఎటువంటి బరువైన వస్తువులు పెట్టకూడదు, కానీ ఈశాన్యం హిందూ విశ్వాసాల ప్రకారం దేవతల కోసం ప్రత్యేకించబడిన పవిత్ర స్థలం కాబట్టి, ఈశాన్య దిశలో అందరూ దేవతలను మోసే కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచడం మంచిని చేకూరుస్తుందని చెబుతున్నారు..

ఈ విగ్రహాన్ని మీ ఇంటికి ఉత్తరం లేదా తూర్పు భాగంలో ఉంచవచ్చు. మీ కార్యాలయంలో కామధేను ఆవు విగ్రహాలను ఉంచేటప్పుడు కూడా ఇవే వాస్తు నియమాలు వర్తిస్తాయి. అంతేకాదు పూజ గదిలో కూడా కామధేను విగ్రహాన్ని ఉంచడం మంచిదని చెబుతున్నారు. ఇక ఇంటి ప్రవేశద్వారం వద్ద కామధేనువు విగ్రహాన్ని ఉంచితే మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇది ఇంట్లోకి ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు..

వెండి,ఇత్తడి, రాగి , పాలరాయి, సిరామిక్ విగ్రహం ఏదైనా కూడా మంచి ఫలితం ఉంటుంది.కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కామధేను విగ్రహం ఇంట్లో సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్యం, సంపద, శాంతి, శ్రేయస్సు , విజయం, సానుకూలత ఈ విగ్రహాలు పెట్టుకున్న ఇళ్లల్లో ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు..ఇప్పుడు చాలా మంది కామధేనువు, లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news