Vasthu : లాఫింగ్‌ బుద్ధ ఎవరు..? పూజ గదిలో ఈ విగ్రహం పెట్టుకోవచ్చా..?

-

లాఫింగ్‌ బుద్ధ విగ్రహం గురించి మీకు బానే తెలిసి ఉంటుంది. చాలమంది ఆఫీస్ టేబుల్‌ పైన, వ్యాపారంలో, ఇళ్లలో ఈ విగ్రహం పెట్టుకుంటారు. ఇది వాస్తు ప్రకారం కూడా మంచిదే. అయితే ఎక్కడ పడితే అక్కడ పెడితేనే మీ కొంప ముంచుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహం అలంకార వస్తువు కాదు. దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ సరైన దిశలో లేనపుడు దాని నుంచి రావల్సిన శుభఫలితాలు రావు. అందుకే ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ముందు సరైన దిశలో పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

లాఫింగ్ బుద్ద ఎవరు?

జపాన్ నివాసి హోతాయ్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హోతాయ్ కఠోర తపస్సు చేయడం ద్వారా జ్ఞానోదయం పొందాడు. జ్ఞానం సంపాదించిన తర్వాత హొతాయ్ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడట. జీవితంలో ప్రజలను నవ్వించడానికే పని చేస్తానని నిర్ణయించుకున్నాడు. హొతాయ్ అనేక దేశాలు పర్యటించాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ప్రజలను నవ్విస్తూ, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది.

లాఫింగ్ బుద్ధ ప్రాశస్త్యం

లాఫింగ్ బుద్ధను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి ఆనందం, సంపద వచ్చి చేరుతుంది. అదే సమయంలో ఇంట్లోని నెగెటివిటి తొలగిపోతుంది. ఫలితంగా ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.

ఇంట్లో ఎక్కడ ఉండాలి

లాఫింగ్ బుద్ధ ఎక్కడ పెట్టుకోవాలనే విషయం గురించి వాస్తు చాలా స్పష్టమైన వివరణలు ఇచ్చింది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాలి. తూర్పు వైపున లాఫింగ్ బుద్దుని పెట్టడం శుభప్రదం. పిల్లల స్టడి రూమ్‌లో లాఫింగ్ బుద్దుని విగ్రహం పెడితే అది పిల్లల మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది. పిల్లల మనసు ఏకాగ్రతతో చదువులో నమగ్నం అవుతారు. ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార స్థలంలో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల వ్యాపారం క్రమంగా మెరుగుపడుతుంది.

బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని వాస్తు చెబుతోంది. మీ గదిలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులను నిరోధించవచ్చు. బంగారు రంగులో ఉండేది మరింత మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రతి విగ్రహం ప్రత్యేకమైందే. ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవద్దు. ఈ విగ్రహం దేవుడి విగ్రహం వంటిది.

ఇలా అస్సలు చేయొద్దు..

నేలమీద విగ్రహాన్ని అసలు పెట్టకూడదు
చీకటిగా ఉండే ప్రదేశంలో కూడా పెట్టకూడదు
తరచుగా చూసే ప్రదేశాల్లో పెట్టుకోవాలి.
లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని టీవి లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఉంచకూడదు.
పూజా స్థానంలో కూడా ఉంచకూడదు.
షూరాక్ మీద కూడా ఉంచకూడదు.
ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం అన్నింటికంటే చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news