వాస్తు : మనీ ప్లాంట్‌ను దొంగలించవచ్చా..? ఈ మొక్క విషయంలో ఈ తప్పులు చేయకండి

-

ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే.. ఇంటికి మనీ వస్తుంది అని చాలా మంది అంటారు. ఇంకా ఈ మనీ ప్లాంట్‌ను కూడా దొంగతనంగా తీసుకురావాలి అని చెప్తారు. అసలు ఇది నిజమేనా..? మనీ ప్లాంట్‌ను దొంగతనం చేయొచ్చా, ఇంట్లో ఏ దిక్కున మనీ ప్లాంట్‌ ఉండాలి.

Money Plant

వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలి. ఎందుకంటే ఈ మొక్కను ఇంటి బయట నాటడం అశుభం. అలాగే ఈ మొక్కను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం మానుకోండి. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ఇంటి ఈశాన్య దిశలో ఎప్పుడూ ఒక మొక్కను ఉంచవద్దు. లేకుంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

మొక్కను ఏ దిక్కున పెట్టాలి?

మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశలో మొక్కను నాటితే ఆ ఇల్లు అభివృద్ది చెందుతుంది. మొక్కను ఇతర దిశలో ఉంచినట్లయితే, ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.

మనీ ప్లాంట్ ఎండిపోకూడదు

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు. ఎండిపోయిన మనీ ప్లాంట్ మీ పురోగతికి మంచిది కాదు. మనీ ప్లాంట్ ఎండిపోతే ప్రగతికి ఆటంకం ఏర్పడి పేదరికం పెరుగుతుంది.

తీగ నేలను తాకకూడదు

మనీ ప్లాంట్ విపరీతంగా పెరుగుతుంది. కానీ మనీ ప్లాంట్ వైన్ ఎప్పుడూ నేలను తాకకూడదని గుర్తుంచుకోండి. ఈ తీగను తాడు సహాయంతో పైభాగంలో కట్టాలి.

మనీ ప్లాంట్‌ను దొంగిలించడం సరైనదానా..?

మనీ ప్లాంట్‌ను దొంగిలించి మీ ఇంట్లో నాటడం చాలా శుభప్రదమని కొందరు నమ్ముతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దొంగచాటుగా మనీ ప్లాంట్ నాటడం మంచిది కాదు. ఈ విషయం ఇంటికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇలా చేయొద్దని పండితలు అంటున్నారు.

మనీ ప్లాంట్‌ నాటితే ఇంటికి ఒక పాజిటివ్‌ వైబ్‌ వస్తుంది, నరదిష్టి పోతుంది అంతే.. అంతకు మించి ఏం జరగదు. ఇంటికి ఎంత పాజిటివ్‌ వైబ్‌ వస్తే..ఇంట్లో మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version