వాస్తు: పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదా..? అయితే ఇలా చేయండి..!

-

మనం వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. నిజానికి మనం ప్రతి రోజు ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాము. ముఖ్యంగా విద్యార్థులు చదువు విషయంలో చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చదువు మీద ఆసక్తి పెట్టలేకపోవడం చదివింది మర్చిపోవడం ఇలా చాలా సమస్యలు కలుగుతూ ఉండొచ్చు.

అటువంటప్పుడు ఈ చిట్కాలని అనుసరిస్తే ఖచ్చితంగా చదువు మీద ధ్యాస పెట్టడానికి అవుతుంది. అలానే పరీక్షలో మంచి మార్కులు కూడా వస్తాయి. మరి అలా విద్యార్థులు సక్సెస్ ని పొందాలంటే ఎటువంటి చిట్కాల్ని అనుసరించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు పొందాలంటే చదువుకునే గది తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి. ఇలా ఉంటే ఏకాగ్రత పెట్టగలరు.

స్టడీ టేబుల్ ఎటువైపు ఉంది అనేది దాన్ని కూడా చూసుకోండి. ఇది కూడా చాలా ముఖ్యం. స్టడీ టేబుల్ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉంటే మంచిది.
అలానే వెల్తురు కానీ గాలి కానీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది పాజిటివ్ ఎనర్జీని కలిగించి నెగటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది.
పసుపు రంగు, ఆరంజ్ రంగు, ఆకుపచ్చ రంగు పిల్లల గదిలో ఉంటే మంచిది. ఇది ఏకాగ్రతని పెంపొందిస్తుంది.
పని చేయని పెన్నులు, పెన్సిల్స్ వంటివి పిల్లల గదిలో ఉండకూడదు. ఇవి నెగిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తాయి.
స్టడీ టేబుల్ మీద చెప్పులు, షూ వంటివి ఉంచకూడదు. ఇవి కూడా నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తాయి.
అందమైన పెయింటింగ్స్ స్ఫూర్తినిచ్చే బొమ్మలు వంటి వాటిని గదిలో ఉండాలి.
పిల్లల చదువుకునే గదిలో యుద్ధానికి సంబంధించిన ఫోటోలు వంటివి ఉండకూడదు. అనుసరిస్తే ఖచ్చితంగా పిల్లలు చదువు మీద ఆసక్తి చూపగలరు.

Read more RELATED
Recommended to you

Latest news