వాస్తు: దోసెలు వేసేటప్పుడు పెనం మీద నీళ్లు జల్లుతారా..? అయితే ఈ సమస్య పక్కా…!

-

నిజానికి చాలా మంది తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం వల్ల ఇంట్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాస్తు ప్రకారం ఫాలో అయితే ఇబ్బంది కూడా ఉండదు. పైగా ఇటువంటి సమస్యల వల్ల అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి. పెనం కి సంబంధించి చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఈ తప్పులు కనుక చేశారంటే ఇంట్లో సమస్యలు వస్తాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

కాలిపోయిన పెదాల్ని ఎప్పుడు ఉపయోగించకూడదు. విరిగిపోయిన పెనాన్ని కూడా ఎప్పుడూ ఉపయోగించకూడదు.
అలానే చాలామంది రాత్రి రొట్టెలు చేసి తర్వాత పెనంను స్టౌ మీద వదిలేస్తూ ఉంటారు అది కూడా మంచిది కాదు. పని అయిపోయిన తరువాత స్టవ్ మీద నుంచి దింపేయాలి లేకపోతే ఆహారం కొరత వస్తుంది.
ఉదయాన్నే చాలామంది పెనాన్ని కడగకుండా తుడిచేసి వాడేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది అని పండితులు అంటున్నారు.
అదేవిధంగా వేడి వేడి పెనం మీద నీళ్లు జల్లకూడదు. దీని వల్ల హాని కలుగుతుంది. భర్త యొక్క జీవితంలో కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే పెనం మీద కాస్త ఉప్పు వేయడం మంచిది. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఈ విధంగా ఫాలో అవ్వడం వల్ల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. తప్పులు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news