వాస్తుని అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. అలానే వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే తొలగించేస్తూ ఉంటాం. వాస్తు ప్రకారం నడుచుకోకపోతే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ధనానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి మొక్క వద్ద ఇవి ఉండకూడదని పండితులు చెప్పారు. మరి వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క వద్ద ఎటువంటి వాటిని ఉంచకూడదు..? ఇలాంటివి పెట్టుకోకూడదు అనేది చూద్దాం. తులసి మొక్క వద్ద ఇవి ఉంటే లక్ష్మి దేవి ఆ ఇంట ఉండదట. ఆర్ధిక సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ తప్పులు జరగకుండా చూసుకోండి.
శివలింగం:
శివలింగాన్ని తులసి మొక్క దగ్గర పెట్టకూడదు. వాస్తు ప్రకారం తులసి మొక్క దగ్గర శివలింగాన్ని పెడితే ఇది ఇబ్బంది తీసుకువస్తుంది.
చీపురు కట్ట:
తులసి మొక్కని ప్రతి రోజు పూజించడం చాలా మంచిది. కానీ తులసి మొక్క దగ్గర చీపురు కట్టని పెట్టకూడదు ఇది నెగటివ్ ఎనెర్జీని కలిగిస్తుంది.
చెప్పులు:
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర చెప్పులు కూడా ఉంచకూడదు. చెప్పులని తులసి మొక్క దగ్గర ఉంచడం వలన లక్ష్మీ దేవికి కోపం వస్తుంది కాబట్టి అసలు ఇలా చేయకూడదు.
చెత్త బుట్ట:
తులసి మొక్క దగ్గర చెత్త బుట్టని కూడా ఉంచకూడదు ఇది కూడా నెగటివ్ ఎనెర్జీని తీసుకు వస్తుంది.
ముళ్ళతో కూడి ఉన్న మొక్కలు:
ముళ్ళుతో ఉన్న మొక్కలని కూడా తులసి మొక్క దగ్గర ఉంచకూడదు ఇలా చేయడం వలన కూడా సమస్యలు వస్తాయి.