ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో బీరువాని పెడుతూ ఉంటారు ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ కచ్చితంగా ఈ విషయాన్ని పట్టించుకోవాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు కూడా కలుగవు. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేక పోతే చక్కగా సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లు ని అందుకే సర్దుకోవాలి.
ఇప్పుడు ఇక బీరువాని ఏ దిశ లో పెడితే మంచిది అనేది తెలుసుకుందాం.. బీరువాని ఏ దిశలో పెట్టాలి అనే విషయానికి వచ్చేస్తే.. బీరువాని ఉత్తర వాయువ్యంలో ఉంచితే ఎంతో మంచి జరుగుతుంది. వాయువ్యమనేది చంద్రునిది. ధన ప్రవాహానికి అధిపతి చంద్రుడు కాబట్టి బీరువాని ఈ దిశలో పెడితే మంచిది. అప్పుడు ధనానికి లోటు ఉండదు. ఆర్థిక బాధలు ఉండవు నైరుతి వైపు కూడా బీరువాని పెట్టుకోవచ్చు ఇది కూడా మంచి చేస్తుంది.
దక్షిణ వైపు బీరువాని పెట్టి ఉత్తర వైపు కి ఓపెన్ చేస్తే కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి ధన నష్టం వంటి ఇబ్బందులు ఉండవు. ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి. బుధుడు సంపదకు అధిపతి కనుక ఉత్తర దిక్కు మధ్య భాగంలో కూడా మీరు అని పెట్టుకోవచ్చు సమస్య ఉండదు కానీ బీరువాని ఎప్పుడూ కూడా నైరుతి వైపు పెట్టుకోవడం మంచిది కాదు దీని వలన ఆర్థిక బాధలు కలుగుతాయి సమస్యలు ఎదుర్కోవాలి.