వాస్తు: చెప్పులను ఏయే రోజుల్లో కొనుక్కోవచ్చు..?

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ వుంటారు. నిజానికి వాస్తుని అనుసరించడం వల్ల సమస్యలు కూడా తొలగి పోతాయి పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి దూరం అవుతుంది ఈరోజు వాస్తు పండితులు షూ లేదా చెప్పులని కొనుగోలు చేయడంలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అయితే మరి షూ లేదా చెప్పులను కొనుగోలు చేయడం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం.

 

మనం చేసే చిన్న చిన్న పనులు మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకని వీలైనంత వరకు మనం మంచి జరిగేలా చూసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం షు లేదా చెప్పుల్ని శనివారం కొనుగోలు చేయకూడదు. షూ లేదా చెప్పులను శనివారం కొనుగోలు చేయడం వల్ల శని దోషం కలుగుతుంది.

ఇక ఎప్పుడూ షూ లేదా చెప్పులను కొనుగోలు చేయచ్చు అనేది చూస్తే.. కొత్త చెప్పులు వేసుకోవడానికి, కొనుగోలు చేయడానికి శుక్రవారం మంచిది కాబట్టి శుక్రవారం నాడు ఇలా అనుసరిస్తే ఇబ్బందులను తొలగిపోయి మంచి కలుగుతుంది. పాత చెప్పులని మీరు శని దేవుడి ఆలయం వద్ద శనివారం నాడు వదిలేస్తే మంచి కలుగుతుంది కనుక అలా చెయ్యచ్చు. ఇలా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.