రుణమాఫీ చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు రైతులను దగా చేశాడు : సీఎం జగన్

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు.. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు వాడి వేడిగా సాగాయి. అయితే.. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షనేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నాడు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు రైతులను దగా చేశాడని తెలిపారు. రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చాడని విమర్శించారు. ఆఖరికి రైతులకు సున్నా వడ్డీని సైతం ఎగ్గొట్టారని అన్నారు. చంద్రబాబు వంటి నేతల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

YS Jagan speaks on women empowerment bill in assembly, says govt. is  working towards women welfare

చంద్రబాబు హయాంలో రైతులకు బీమా పరిహారం కూడా అందలేదని ఆరోపించారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకున్నామని, రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు సీఎం జగన్. చంద్రబాబు పాలనలో ప్రతి ఏడాది కరవేనని… చంద్రబాబు, కరవు కవలలు అని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news