ఇంట్లో నల్లాలు లీక్ అయితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయా?

-

ఏ ఇంట్లో అయితే నీరు వృథాగా పోతుందో…ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తిష్టేసుకుంటాయట. అసలు నీళ్లు పోవటానికి, నల్లాలు లీక్ అవటానికి, ఆర్థిక ఇబ్బందులు రావటానికి సంబంధం ఏంటి అని సందేహం మీకు కూడా వచ్చే ఉంటుంది కదా. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్లాలు లీక్ అవుతున్నాయి అంటే.. అది ఇంట్లో ఆర్థిక సమస్యలను సూచిస్తోందని అర్థం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అసలు ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రంపై విశ్వాసం లేనివారికే కాదు.. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారిలోనూ కొంతమందికి కలిగే సాధారణ సందేహం ఇది. అయితే, దీనికి వాస్తు శాస్త్రం తెలిసిన వారు ఏం అంటున్నారంటే.. నీరు వృథా అవడం అంటే వరుణ దేవుడికి ఆగ్రహం తెప్పించడమేనని, తద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుంటుదట. ఇక అసలు సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయని చెబుతున్నారు.

వంట ఇంట్లో నల్లాలు లీక్ అయితే..?

వంట గదిలో నల్లాలు లీక్ అవుతున్నాయంటే అది మరీ ఇబ్బందికరం అని వాస్తు నిపుణులు అంటున్నారు. వంట గదిలో నిప్పు ఉంటుంది. కాబట్టి నిప్పు ఉన్న చోట నీళ్లు కారడం అశాంతికి చిహ్నం. అగ్ని దేవుడు ఉండే చోట నీరు లీక్ అయితే… అది మరింత నెగటివ్ ఎనర్జీకి దారి తీస్తుందట. ఇది ఇంట్లో కుటుంబసభ్యుల అనారోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు అని వాస్తు శాస్త్రం తెలిసిన పండితులు చెబుతున్నారు.

మరి వీటికి పరిష్కారం ఏంటి?

లీక్ అయ్యే నల్లాలు ఇంట్లో వృథా ఖర్చులను పెంచుతాయి.. కనుక వీలైనంత త్వరగా ఆ నల్లాలను రిపేర్ చేయించి అనవసర ఖర్చులకు బ్రేక్ వేయడం ద్వారా అర్థిక ఇబ్బందులు నుంచి బయటపడొచ్చు అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఎంత సంపాదించినా అది వృథా ఖర్చులకే సరిపోతుందని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news