భారత దేశం లో చూడాల్సిన ప్రముఖ గణపతి ఆలయాలు..!

మన భారత దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు మనం వినాయకుడుని పూజించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలి అంటే ముందు మన విఘ్నేశ్వరుడిని పూజించాలి. ఏ కార్యంలో అయినా సరే తొలి పూజలందుకుంటాడు వినాయకుడు. అయితే భారత దేశంలో ప్రసిద్ధి చెందిన వినాయక ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.

కాణిపాక వినాయక ఆలయం, చిత్తూరు:

వేల సంవత్సరాల కాలం నాటిది ఈ ఆలయం. చిత్తూరు జిల్లా కాణిపాకం లో ఈ ఆలయం ఉంది. చోళులు రాజు ఈ గణపతి ఆలయాన్ని కట్టారు అయితే రోజు రోజుకి ఇక్కడ ఉండే వినాయకుడి విగ్రహం పెరుగుతూ వస్తుంది. అలానే ఇక్కడ వున్న వినాయకుడు స్వయంభూగా వెలిశారు.

సిద్ధి వినాయక ఆలయం, ముంబై:

ఇది కూడా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం. ఇక్కడ వినాయకుడిని నవ సత్య గణపతి అంటారు. ఈ ఆలయం 1801లో నిర్మించారు. ఎంతో ఆకర్షణీయంగా ఈ దేవాలయం ఉంటుంది. అవకాశం వస్తే తప్పక ఈ ఆలయాన్ని సందర్శించండి.

పూణే గణపతి ఆలయం:

ఇక్కడ వినాయకుడు 7.5 అడుగుల ఎత్తులో ఉంటారు. ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కూడా పురాతన కాలం నాటిది.

విజ్ఞహర్ ఆలయం, Ozar:

పూణే కి 85 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.

గణపతిపూలే ఆలయం రత్నగిరి:

ముంబై కి 350 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాల్లో ఇది ఒకటి.  ఈ ఆలయం కూడా తప్పక చూడాల్సిందే.

తిరుచిరాపల్లి వినాయక ఆలయం:

త్రిచి లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది. ఇక్కడికి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. కావేరి నది ఇక్కడ ఉంటుంది. నిజంగా ఈ ఆలయం వ్యూ చాలా సుందరంగా ఉంటుంది.