‘దక్షిణ భారత దేశ ఆజ్మీర్ ‘ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటంటే?

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి..అందులో కడపలో పుణ్యక్షేత్రాలతో పాటు పెద్ద దర్గా కూడా ఉంది..దక్షిణ భారత దేశ ఆజ్మీర్ గా పేరుగాంచిన దర్గా మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ సాహెబ్ ను నమ్ముకొని ప్రార్థించి విబూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ దర్గాను ఎంతో మంది రాయకీయ, సినీ ప్రముఖులు నిత్యం సందర్శిస్తూ ఉంటారు..ఆ దర్గా గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దర్గా కావడం గమనార్హం..అందువల్లే దీనిని దక్షిణ భారత దేశ ఆజ్మీర్ అని అంటారు. ఈ దర్గా నిర్మాణానికి మూలపురుషుడు హజరల్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీనాయబ్- ఎ-రసూల్.. మహ్మద్ ప్రవక్త వంశీయుడని చెబుతారు. కర్నాటకలోని బీదర్ నుంచి క్రీస్తుశకం 1683లో కడపకు వచ్చాడు. అక్కడే ప్రజలకు దైవ బోధన చేస్తూ కాలం గడిపాడు..ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఆ సమయంలో కడపను పాలించేవాడు. నేక్ నామ్ ఖాన్ తన గురువుకు జీవసమాధి నిర్మించిన స్థలమే ప్రస్తుతం పెద్ద దర్గా అని అంటారు.

క్రీస్తుశకం 1716లో అమీర్ పీర్ దర్గాలోనే హజరల్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీనాయబ్-ఎ-రసూల్ జీవసమాధి అయ్యారు.ఈయన కుమారులు పీఠాధిపతులు ఉన్నారు..వారి మరణం తర్వాత ఆ వంశీయులే కడపను ఏలుతున్నారు..ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతి కొనసాగుతున్నారు. ఆరీఫుల్లా హుసేనీ వారసుడైన హజ్రత్ సూఫీ సర్మస్ సానీ చిల్లకష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహ్మద్ మహ్మదుల్ హుసేనీ తన 11వ ఏట ఇంటి నుంచి వెళ్లిపోయి తాడిపత్రి సమీపంలోని గుహల్లో 50 ఏళ్లు తపస్సు చేశారు..ఆ తర్వాత ఆయన పెద్ద దర్గాకు వచ్చి జీవ సమాధి అవుతాడు..

అమీన్ పీర్ దర్గాలో చిన్న, పెద్ద కలిపి మొత్తం 18 దర్గాలు ఉన్నాయి. ప్రతి నెల గంధం, ఉరుసు ఇక్కడ జరుగుతుంది. అరీఫుల్లా హుస్సేనీ ఉరుసు ఏడు రోజుల పాటు జరుగుతుంది.కుల, మత, ప్రాంతాలకు అతీంతగా లక్షల సంఖ్యలో ఇక్కడ జరిగే ఈ ఉరుసుకు భక్తులు హాజరవుతారు. ఉర్దూ మాసం మదార్ లో నిర్వహించే ఈ ఉరుసు ఉత్సవం కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుంది.భక్తులకు సూఫీతత్వ ఉపదేశాలిస్తారు. ఉరుసు సందర్భంగా పెద్ద ఎత్తున ముషాయోరా (కవి సమ్మేళనం) జరుగుతుంది..పెద్ద దర్గాకు రెండు శాఖలు ఉన్నాయి. నందలూరులో ఒకటి, రెండోది చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామంలో మరొకటి ఉంది. ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.కడప నడి బొడ్డున ఈ దర్గా ఉంది.. ఆటోలు బస్టాండ్ నుంచి నిత్యం వెలతాయి..

Read more RELATED
Recommended to you

Latest news