నాగులపంచమి ప్రాముఖ్యత ఏమిటి..? అసలు ఎందుకు జరుపుకుంటారు?

-

భారతీయులు ఎక్కువగా దేశంలోని ప్రతి దేవుడిని పూజిస్తారు..అయితే ఎన్నో సాంప్రదాయాలకు సంభందించి ఎన్నో కథలను మనం వింటూనే ఉంటాము..ఇప్పుడు మనం నాగులపంచమి గురించి వివరంగా తెలుసుకుందాం.. శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమిని నాగ పంచమి లేదా నాగులు పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమ శివుడే వివరించాడు.
ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించారు..

ఈరోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగ పంచమి రోజున నాగులను పూజించినవారికి విష బాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప, నాగదోషాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం..

ఈ రోజున నాగ పంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకలసంపదలు కలిగి, రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగ పంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఎటువంటి ఆర్థిక భాధలు ఉండవని అంటున్నారు..

యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగానూ, గరుడ పంచమిగానూ జరుపుకుంటారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు. నాగ పంచమి రోజున పుట్టకు పూజలుచేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు.. మరి కొంతమంది మాత్రం మట్టితో నాగులను తయారు చేసి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు..

ఇకపోతే కశ్యప ప్రజాపతి ఆయన భార్యలు వినత, కద్రువల సంతానమే గరుత్మంతుడు, నాగులు. శ్రావణ పంచమి రోజే వినతకు గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. కాబట్టి నాగ పంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. అలాగే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడ పంచమి వ్రతం చేస్తారు..ఈ వ్రతాన్ని సోదరులు ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యాలని ఒక నియమం ఉంది.. ఇది నాగులపంచమి అసలు స్టోరీ..

Read more RELATED
Recommended to you

Latest news