ఏ తిథిలో ఏం చెయ్యాలి.. ఏయే తిథులలో ప్రయాణాలు శుభ ఫ‌లితాలు

-

తిథులను బట్టి అనేక పనులు చేస్తుంటాం మనం. అయితే ఈ వార్త కేవలం కర్మ సిద్ధాంతం, పంచాంగం పై నమ్మకం కలిగిన వారు మాత్రమే చదవండి.

మనకు పాడ్యమి నుంచి మొదలు పూర్ణిమ/అమావాస్య వరకు పదిహేను తిథులు ఉంటాయి. ఈ రోజుల్లో చేసే పనులను బట్టి వివి ఇవి ఒక్కోటి ఒకోలాగా ఫలితాలన ఇస్తాయి. అయితే ఆయా తిథులలో ప్రయాణాలు చేస్తే కలిగే ఫలితాలను తెలుసుకుందాం…

అయితే ఈ ఫలితాలు అందరికీ కావు. ఇవి ముఖ్యంగా నిత్యం ఉద్యోగ అవసరం, వైద్య అవసరాలు, విద్యార్థులు, శ్రామికులు, కర్షకులు, వ్యాపారాల కోసం నిత్యం ప్రయాణాలు చేసే వారికి వర్తించవు. కేవలం ఆయా ప్రత్యేక పనులు, శుభకార్యాల కోసం కొత్తగా ప్రారంభించేవాటికి మాత్రమే ఆయా తిథులను, గడియలను చూసుకోవాలి. నిత్యం చేసే ఏపనికైనా తిథివార, నక్షత్రలతో పనిలేదు. కేవలం సంకల్ప బలం, కృషి ఉంటే అవి ఫలిస్తాయి.

  • శుక్లపాడ్యమి దు:ఖాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయి.
  • విదియ రోజు కార్యసిద్ధి జరుగుతుంది.
  • తదియనాడు ప్రయాణము సకల కార్యాలనూ సిద్దించేలా చేస్తుంది.
  • చవితినాడు ప్రయాణం ఆపదలను తెచ్చే అవకాశము.
  • పంచమినాడు శుభము షష్ఠినాడు అకాలవైరాలను తెస్తుంది.
  • సప్తమినాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు ఎక్కడికెళ్ళినా జరుగుతాయి.
  • అష్టమినాడు అష్ఠకష్టాలే.
  • నవమిరోజు నష్టములతోపాటు అనేక వ్యాధులు కలుగుతాయి.
  • దశమి రోజు ప్రయాణము ధనలాభము.
  • ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యము. అలాగే ద్వాదశి మహానష్టాలను తెచ్చిపెడుతుంది.

త్రయోదశి శుభాలను తెచ్చే తిథి. బహుళ చతుర్థీ ఎంతో కీడును కలిగిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే అమావాస్య రోజున ప్రయాణం చేస్తే ఆపదలు సంభవించవచ్చునని కూడా జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news