చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ఉండాలి?

చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వల్ల తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని బాధ పడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ జబ్బులు రావడం, ఇబ్బందులు పడుతుంటారు. వీరందరికీ సులభోపాయం, ఎంతోమంది తమ అనుభవంతో చెప్పిన శాస్త్రీయ పద్ధతిని తెలుసుకుందాం…

ఆంజనేయస్వామి అంటే చాలు ధైర్యానికి ప్రతీక. దుష్ట శక్తులను పారద్రోలడానికి, సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను దూరం చేస్తారన్నది అందరికీ తెలుసు. అయితే కొన్ని వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుని ఆంజనేయస్వామిని (ఫొటో కానీ మీరు దైవంగానే భావించాలి) ఇంట్లో ఉంచితే తప్పక మంచి జరుగుతంది.

– ఇంట్లో ఉత్తర దిశలో హనుమంతుని ఫొటో పెట్టడం వల్ల దక్షిణ దిశ నుంచి వచ్చే చెడు శక్తుల నివారణ జరుగుతుంది.

– ఆకాశమార్గంలో ఎగురుతున్న హనుమాన్ ఫొటోను పెట్టుకోవడం వల్ల దుష్టశక్తుల నివారణ త్వరితంగా జరుగుతుంది

– ఇంట్లో హనుమంతుని ఫొటో పెట్టి పూజ చేసుకోవడం వల్ల సుఖం, ధనం, భయనివారణ జరుగుతాయి.

– వాస్తు ప్రకారం హనుమంతుని ఫొటోను దక్షిణ దిశ చూసే విధంగా అమర్చుకోవాలి.

– శక్తిని ప్రదర్శిస్తున్న ముద్రలో ఉన్న ఆంజనేయస్వామి ఫొటో వల్ల దుష్టశక్తులు పోతాయి.

– హనుమాన్ ఫొటో ఇంట్లో ఉండటం వల్ల సకారాత్మక శక్తి పెరుగుతుంది. ఇంట్లో నివసించే వారి మధ్య పరస్పర ప్రేమవాతావరణం ఏర్పడుతుంది. భయం, ఆందోళన, చెడు ఆలోచనలు పోతాయి.

– వీలైతే రోజుకు ఒక్కసారి ఒక్క అగరువత్తి వెలిగించి స్వామి ముందు పెట్టి హనుమాన్‌చాలీసా లేదా దండకం చదివితే చాలు సమస్త గ్రహదోషాలు, పీడలు పోతాయి.

– కనీసం ఏడాదిలో ఒక మండలం రోజులైనా హనుమాన్ చాలీసా చదవండి, మీ కుటుంబాలను రక్షించుకోండి.

– పిల్లలకు భయనివారణ, ధైర్యసహసాలు, బలం, ఆయుష్షు వఋద్ధి చెందుతాయి.

– ప్రతీరోజు చాలీసా పారాయణం చేసేవారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే తత్వం అలవడుతుంది, సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు.

ఇక ఆలస్యం ఎందుకు మంచిరోజు చూసి స్వామిని మీ ఇంటికి ఆహ్వానించుకోండి.

– శనివారం, మంగళవారం, సోమవారం మంచి తిథి,సమయం చూసుకుని స్వామిని మీ ఇంటో ఉత్తరదిశలో అంటే దక్షిణం చూసే విధంగా అమర్చుకోండి. ఆనందంగా ఉండండి.

జై వీరహనుమాన్

– కేశవ