శివాభిషేకం అంటే చాలు అందరికి సాధ్యమయ్యే ప్రక్రియే. అంతేకాదు అన్నింటికి సర్వరోగనివారిణి, సర్వకార్య ఫలప్రదాయణిగా ప్రసిద్ధి. ఎవ్వరికీ ఏ కష్టమొచ్చినా చేయించుకోవాల్సింది శివాభిషేకమే. అటువంటి శివాభిషేకంలో ఆయా కామ్యాలను తీర్చుకోవడానికి ఆయా పదార్థాలను వాడాలని శాస్త్ర వచనం. ఏ పదార్థం వాడితే ఏం ఫలమో తెలుసుకుందాం…
పదార్థాలు | ఫలితం |
శుభ్రమైన నీరు | శివానుగ్రహం |
ఆవుపాలు | సర్వసౌఖ్యం |
ఆవుపెరుగు | ఆరోగ్యం, బలం, యశస్సు |
ఆవునెయ్యి | ఐశ్వర్య వృద్ధి |
తేనే | తేజోవృద్ధి |
చెరుకురసం | ధనవృద్ధి |
మెత్తని పంచదార | దుఃఖనాశనం |
ద్రాక్షపండ్ల రసం | కార్యజయం, జ్ఞానప్రాప్తి |
మామిడిపండ్ల రసం | దీర్ఘవ్యాధి నాశనం |
నేరేడుపండ్ల రసం | వైరాగ్యం |
ఖర్జూర రస జలం | సకల కార్యజయం |
కొబ్బరినీళ్లు | సర్వసంపద వృద్ధి |
భస్మజలం | మహాపాపహరం |
బిల్వదళోదకం | భోగభాగ్యాలు |
దూర్వోదకం | నష్టద్రవ్యప్రాప్తి |
రుద్రాక్షోదకం | మహాదైశ్వర్యం |
పుష్పోదకం | భూలాభం |
సువర్ణోదకం | దారిద్య్రనాశనం |
నవరత్నోదకం | ధాన్యం, గృహం |
హరిద్రోదకం | సౌభాగ్యం, మంగళప్రదం |
సుగంధోదకం (పన్నీరు) | పుత్రలాభం |
నువ్వుల నూనె | అపమృత్యు భయనివారణం |
తిలమిశ్రిత ఆవుపాలు | శనిగ్రహపీడా నివారణ |
శర్కరమిళిత ఆవుపాలు | జడబుద్ధి నివృత్తి, వాక్‌శుద్ధి, వాక్సిద్ధి |
దక్షిణావృత శంఖోదక జలం కస్తూరీజలాలు |
గృహకల్లోలాలు తొలుగును చక్రవర్తిత్వం |
-కేశవ