ప్రతి ఒక్కరి ఆరాటం తమ పిల్లలు భవిష్యత్ కోసమే. దీనిలో ప్రధానమైనది విద్య. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అమూల్య ధనం ఉన్నత విద్యలను చదివించడమే. అయితే పలు కారణాల వల్ల పిల్లలు చదువులో సరిగా రాణించలేక పోవచ్చు. గ్రహబలాలు సహకరించక పోవచ్చు. సావాస దోషాలు కారణం కావచ్చు. అన్నింటిని అధిగమించడానికి సంకల్ప బలం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు దైవబలం, దైవిక శక్తుల అవసరం కూడా ఉంటుంది. వాటిలో దైవికబలాలో అత్యంత పవర్‌ఫుల్‌గా పేరొందిన రుద్రాక్షను ధరింపచేయండి.
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ కాంబినేషన్ వాడండి
చదువలో రాణించాలంటే ఏ రుద్రాక్షను ధరించాలనేది మీ సందేహం కదా.. సాక్షాత్తు బ్రహ్మ స్వరూపంగా పేరొందిన చతుర్ముఖి రుద్రాక్షను ధరింపచేయండి. ఇంకా అవకాశం ఉంటే రెండు చతుర్ముఖి రుద్రాక్షలను, ఒక షణ్ముఖి రుద్రాక్షను కలిపి ధరింపచేయండి. ఈ రెండు రుద్రాక్షల బంధనాన్ని అంటే కాంబినేషన్‌ను సరస్వతి బంధనం అంటారు.
దీని వల్ల చదువుకునే పిల్లలకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, రాయడం, చదవడంలో ప్రావీణ్యతలను ఈ కాంబినేషన్ ప్రసాదిస్తుంది. ఒక్క విషయం ఏడు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రం ఒక్క చతుర్ముఖి రుద్రాక్ష సరిపోతుంది. ఏడేండ్ల పై బడినవారికి మాత్రమే పైన చెప్పిన కాంబినేషన్ రుద్రాక్షలను ధరిస్తే తప్పక సరస్వతి కటాక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
రుద్రాక్షలను ఎలా ధరించాలి..
రుద్రాక్షలను సర్టిఫై చేసినవి తీసుకోండి. అవకాశం ఉంటే ఎవరైనా బంధువుల నేపాల్, ఇండోనేషియాలకు వెళుతుంటే అక్కడ తెప్పించుకోండి. లేదా నమ్మకమైన చోట ప్రామణికమైన సర్టిఫికెట్ ఇచ్చి అమ్మేచోట రుద్రాక్షలను కొనుగోలు చేయండి. వీటిని తీసుకున్న తర్వాతి వాటిని పురోహితులతో అర్చన చేయంచండి. వీలైతే రుద్రాభిషేకం ఆవుపాలతో చేయంచి మీ పిల్లలకు తారాబలం కలిసినరోజు వారం, వర్జం, శుభసమయం చూసుకుని మెడలో ధరింపచేయండి. ప్రతి బుధవారం లేదా సోమవారం ఆ రుద్రాక్షలను శుభ్రమైన నీటితో కడిగి ఆవుపాలలో కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి వాటిని తిరిగి ధరిస్తూ ఉండాలి. దీనివల్ల దైవానుగ్రహం కలిగి మీ పిల్లలకు చక్కని చదువు వస్తుంది.
ఇది అనుభవ పూర్వకంగా పలువురు తెలుసుకున్న విషయం. నమ్మకం, విశ్వాసం చాలా ప్రధానం. పరీక్షల సమయంలో పరీక్ష హాల్‌లోకి అనుమతించకపోవచ్చు. అంతమాత్రాన ఇబ్బంది ఏమి లేదు. ప్రతిరోజు అది శరీరంపై ఉండటం వల్ల పిల్లలక కావల్సిన శక్తి వస్తుంది. శౌచసమయాల్లో అంటే పురుడు, మైలలు వచ్చినప్పుడు వాటిని దూరంగా ఇంటో భద్రపర్చండి. అవి అయిపోయిన తర్వాత శుద్దిచేసి వీలైతే అభిషేకం చేయించుకుని తిరిగి ధరించాలి.
– కేశవ