నల్లగొండ జిల్లాకు మరో నర్సింగ్ వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్ఎల్‌బిసి ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణ పనిలో ఉన్న వైద్య కళాశాల వద్ద నూతనంగా మరో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. 5 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల నిధులు కేటాయించారు. అందులో రూ.32 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం, రూ.8 కోట్లతో పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.