దివ్యాంగులకు అందజేసే ఉపకరణాల దరఖాస్తు స్వీకరణ గడువు తేదీ ఈనెల 14 వరకూ పొడిగించినట్లు జనగాం జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. బ్యాటరీ వీల్ చైర్లు 6, ల్యాప్టాప్ 4, డైసీ ప్లేయర్స్ 2, 4G స్మార్ట్ఫోన్లు 7, జనగామ జిల్లాకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. అర్హులైన దివ్యాంగులు www. tsobmms. cgg. gov. in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 9573139411ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.