స్ఫూర్తి: మూడు సార్లు వ్యాపారంలో ఫెయిల్… కానీ ఇప్పుడు వెయ్యి కోట్ల టర్న్ ఓవర్…!

-

ఎప్పుడు ఎవరు ఎలా సక్సెస్ అవుతారు అనేది చెప్పలేము. సమయం ఈరోజు ఉన్నట్టు రేపు కూడా ఉండదు. ఒక్కొక్కసారి సక్సెస్ ఉంటే ఒకసారి ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. నమ్మకంతో ముందుకు వెళ్లి పోవాలి. అలా వెళ్తేనే సక్సెస్ అందుకోగలము. అయితే ఫెయిల్యూర్ నుండి సక్సెస్ ని ఈ బిజినెస్ మ్యాన్ ఎలా పొందారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్, ప్రతాప్ శక్తి లిమిటెడ్ చిప్స్ తయారు చేస్తూ ఉంటారు. సుమారు 18 ఏళ్ల నుంచి కూడా ఈ బిజినెస్ ని రన్ చేస్తూ ఉన్నారు. 2004లో కేవలం ముగ్గురు మందితో మొదలైన వ్యాపారం.. 2021 కి మూడు వేల మందికి చేరింది. అమిత్ కుమార్ ఈ బ్రాండ్ వెనకాల ఉన్న బిజినెస్ మ్యాన్. మూడు సార్లు వెంచర్ ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ కూడా అవకాశం కోసం చూశారు.

కష్టపడుతూనే ముందుకు వెళ్లారు. ఈయన యునైటెడ్ స్టేట్స్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఒక పాకెట్ 5 రూపాయలకి అమ్మేవారు. 2012 కి కంపెనీ 172 కోట్ల రెవిన్యూ ని తీసుకొచ్చింది. ఇలా మూడు వెంచర్స్ తో ఫెయిల్ అయిన కంపెనీ ఈ స్థాయికి చేరుకుంది అని గొప్ప విషయమే.

2017లో ఐపీఓ కి కంపెనీ వెళ్ళినా ఈరోజు 1000 కోట్ల టర్నోవర్ ని కంపెనీ తీసుకొస్తోంది. ఫెయిల్యూర్ వచ్చింది కదా అని ఆగిపోయినా.. వెనక్కి వెళ్లి పోయినా సక్సెస్ అనేది ఉండదు అని ఈయన కష్టాన్ని చూస్తే మనం తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news