రేషన్ దుకాణాల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేషన్ బియ్యం పంపిణీకి బయోమెట్రిక్, ఐరీష్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయగా ఆ దిశగా సంగారెడ్డి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 845 మంది రేషన్ డీలర్లు ఉండగా 3,51,652 తెలుపు రేషన్ కార్డులు, సభ్యులు 11,84,264 మంది ఉన్నారు. ఇక 27,126 అంత్యదోయ, సభ్యులు 69,488 మంది, అన్నపూర్ణ కార్డులు 104, సభ్యులు 105 మంది ఉన్నారు. ఈ ప్రక్రియతో ఓటీపీతో పంపిణీ పరిమితమవనుంది.