సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాడిదకు జన్మదిన వేడుకలు నిర్వహంచారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన.. గాడిద పాలనను తలపించేలా ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ పోటీపడి నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.