కేంద్రం మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో లాభాలని మనం పొందొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటి.
ఇందులో కనుక చేరితే ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ ని పొందవచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.
స్కీమ్ తో ఎంత పెన్షన్ వస్తుందంటే..?
అర్హత కలిగిన వారికి ఈ స్కీమ్ ద్వారా రూ.3 వేలు వస్తాయి. కానీ ఈ డబ్బులు అరవై ఏళ్ళు తరవాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీనితో కార్మికులకు వయసు మల్లిన తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ డబ్బులు డైరెక్టుగా ఖాతా లోనే పడతాయి.
స్కీమ్ కోసం ఎంత చెల్లించాలి..?
ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ.55 నుంచి చెల్లించాలి అంతే. ప్రతి నెలా కొంత మేర డబ్బులు కడుతూ వెళ్లాలి. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి ఉండి. మీరు చేరిన వయస్సు బట్టి పెన్షన్ అనేది ఉంటుంది. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.55 కట్టాలి. అదే 40 ఏళ్లలో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి.
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కి కావాల్సిన డాక్యుమెంట్స్:
బ్యాంక్ అకౌంట్
ఆధార్ కార్డు
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కి ఎవరు అర్హులు..?
18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వారు అర్హులు.
తప్పనిసరిగా అసంఘటిత రంగానికి చెందిన వారై ఉండాలి.
అలానే ఆదాయం నెలకు రూ.15 వేల వరకు మాత్రమే ఉండాలి.
ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్ లో ఎలా చేరాలి…?
దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈజీగా ఈ స్కీమ్ లో చేరచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో అర్హులు చేరచ్చు. లేదు అంటే మాన్ ధన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకో వచ్చు. పథకంలో చేరిని వారికి కచ్చితమై పెన్షన్ వస్తుంది. ఒకవేళ పథకం లో చేరిన వారు మరణిస్తే జీవిత భాగస్వామికి సగం పెన్షన్ ఇస్తారు. లేదు అంటే డిపాజిట్ చేసిన డబ్బులను ఇచ్చేస్తారు.