చౌడపూర్ మండల పరిధిలోని మందిపాల్ గ్రామంలో రైతు యాదయ్య రోజు మాదిరిగానే తన గేదెలను చేను దగ్గర కట్టేశాడు. మరుసటి రోజు చూసేసరికి లేగ దూడ కొద్దిదూరంలో రక్తపుమడుగులో పడి ఉంది. చూసి చిరుత దాడికే మృతి చెందింది అని భావించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చిరుతను పట్టుకొని రక్షణ కల్పించాలి కోరుతున్నారు
Rangareddy: మందిపాల్ గ్రామంలో చిరుత దాడి..!
-