దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధును జిల్లాలో పటిష్టంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ హన్మంతరావు స్పష్టం చేశారు. దళితబంధు పథకం కింద మొదటి విడతగా సిద్దిపేట జిల్లాలో 457 మందిని ఎంపిక చేశామన్నారు. లాభదాయక యూనిట్‌లైన మినీడైరీ, ఫౌల్ట్రీ, మెడికల్ షాప్ తదితర సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను ఈనెల 5 నుంచే ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలన్నారు.