1925 అక్టోబర్ 6 వ తేదీన నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ సమీపంలోని లక్కారం గ్రామంలో లక్ష్మీ నరసయ్య , వరలక్ష్మి దంపతులకు జన్మించిన సీతారాం. బతుకు తెరువు కోసం తండ్రి హైదరాబాద్ రావడంతో ఇక్కడే స్థిరపడ్డారు.
17 ఏళ్ల వయస్సులో హైదరాబాద్ విమోచనకు ముందు ‘హైదరాబాద్ బులెటిన్’ అనే జర్నల్ లో జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి పాత్రికేయుడిగా 5 దశాబ్దాల సుదీర్ఘ జీవితం కొనసాగించారు. స్టేట్స్ మన్, ఇకనామిక్ టైమ్స్, పేట్రియాట్, లింక్ వంటి ప్రసిద్ధ ఆంగ్ల జాతీయ పత్రికల్లో మరియు యు.ఎన్.ఐ. వార్తాసంస్థకు హైదరాబాదు, కలకత్తా, మద్రాసు బ్యూరోల అధిపతిగా సేవలందించారు.
పాత్రికేయుడిగా ఆయన ఎన్నో సంచలన వార్తలు అందించారు.వీ.వీ.గిరి రాష్ట్రపతిగా వున్నకాలంలో ఆయనతో కలసి యూరోపులో పర్యటించారు.పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ నార్ల జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.
చివరి శ్వాస వరకు జర్నలిజమే ఊపిరిగా బతికిన సీతారాం గారు 2012 నవంబర్ 5 తేదీన హైదరాబాద్ లో మరణించారు .నిర్భీతి, నిజాయితీ, ముక్కుసూటితనం సీతారాం నైజం. జర్నలిస్టుగా ఆయన సాధించిన విజయాలు గురించి ప్రస్తుత యువ జర్నలిస్టులు నేర్చుకోవాల్సిన పాఠాలు.