భారత్ కు రష్యా సాయం… ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించేందుకు బస్సుల ఏర్పాటు

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధం మధ్యలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ‘ఆపరేషన్ గంగా’  ద్వారా భారత విద్యార్థులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఇండియన్ వాయు సేనకు సంబంధించి సీ-17 విమానాల ద్వారా పెద్ద ఎత్తున విద్యార్థులను తరలిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో ఉన్న విద్యార్థులను పోలెండ్, రొమేనియా, స్లొవేకియా, హంగేరి నుంచి తరలిస్తున్నారు. 

ఇదిలా ఉంటే… రష్యాలోని ఖార్కివ్, సుమీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను రష్యాలోని బెల్గొరోడ్ ప్రాంతానికి భారతీయ విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులను తరలించేందుకు 130 బస్సులను సిద్ధం చేసినట్లు నేషనల్ ఢిఫెన్స్ కంట్రోల సెంటర్ మెడ్ కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్ గురువారం వెల్లడించారు. అయితే ఇప్పటికే రష్యాతో భారత్ టచ్ లో ఉంది. తమ విద్యార్థులను రష్యాలోంచి స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన రష్యా భారతీయును తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news