మేడారం మహా జాతరకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మేడారం పరిసరాల్లో చుట్టూ 10కిలో మీటర్ల దూరం వరకు జనమే అరణ్యంగా మారిపోయారు. డిసెంబర్, జనవరి నుంచే భక్తుల రాక కొద్దీ కొద్దిగా పెరుగుతూ వస్తోంది. జాతర ముందు వరకు 50 లక్షల మంది వచ్చారని, జాతర ప్రధాన ఘట్టాలు ప్రారంభమయ్యాక మరో 75 లక్షల మంది అమ్మవార్ల చెంతకు వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.