నిజాంపేట్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 63 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు పెరిగిన జీతాలను అందజేయనున్నట్లు నిజాంపేట్ మేయర్ నీలారెడ్డి తెలిపారు. జూన్ 2021 నుంచి 30 శాతం పెరిగిన జీతాలను, అరియర్స్ సహా అందజేస్తామన్నారు. మొత్తం 495 సిబ్బందికి రూ.17,07,644 జీతాలు వారి అకౌంట్లలో జమ చేయనున్నామన్నారు.