గ్యాస్ ఏజెన్సీపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Gas.jpg
Gas.jpg

మల్లాపూర్ మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం సిలిండర్లను ఇంటింటికీ సరఫరా చేయడం లేదని ఎంపీపీ కాటిపల్లి సరోజన గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. డెలివరీ ఛార్జీలు చెల్లించి వినియోగదారులు గోదాము వద్దకు వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని, ఇంటింటికీ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.