నిరుద్యోగ యువత ఉద్యోగాల సాధన కోసం ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ కోచింగ్ సెంటర్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీపీ జనగామ శరత్ రావు పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య తదితరులతో కలిసి శుక్రవారం మాట్లాడారు. ఆర్థికంగా వెనకబడిన గ్రామీణ నిరుద్యోగ యువత కోసం మండల కేంద్రంలోనే ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పారు.
కరీంనగర్ : ముస్తాబాద్‌లో కేటీఆర్ కోచింగ్ సెంటర్’
-