సిరిసిల్ల: అధిక వడ్డీ వ్యాపారి ఇంట్లో టాస్క్ ఫోర్స్ దాడులు

అంబికా నగర్‌లో అక్రమంగా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నాడనే సమాచారం మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో ఈగ రాజు ఇంట్లో సోదాలు చేశారు. అతని వద్ద నుండి రూ.15,30,000 విలువ చేసే 22 ప్రాంసరి నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈగ రాజును సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు యధాతథంగా కొనసాగుతాయన్నారు.