
మునుగోడు: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేసిఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని అందులో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోయారన్నారు. హుజురాబాద్ ఎలక్షన్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఈటల రాజేందర్‌ని ప్రజలు గెలిపించుకున్నారని, తెలంగాణ యువత వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ సర్కార్‌ను గద్దె దించడం పక్కా అని ఆయన అన్నారు.