సిద్దిపేట నియోజకవర్గంలో మరో మెగా వాటర్ షెడ్ మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. చౌడారం వాటర్ షేడ్ ప్రాజెక్టు రూ.10 కోట్ల 56 లక్షల 66వేల నిధులు మంజూరు అయినట్లు చెప్పారు. చౌడారం మెగా వాటర్ షెడ్ ప్రాజెక్టు కింద 9 గ్రామాలకు లబ్ధి జరుగుతుందన్నారు. 4 వేల 803 హెక్టార్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణము ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల స్వరూపం మారనుందన్నారు.