సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామాపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. జగ్గారెడ్డి రాజీనామాపై ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడతానన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు సరికాదని సూచించారు. తాను బాధ్యత తీసుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో మాట్లాతానని చెప్పారు. కొంతమంది వ్యక్తుల కోసం కాదని, పార్టీ కోసం పనిచేయాలని జగ్గారెడ్డికి చెప్పానన్నారు.