
నర్సాపూర్ డివిజన్‌లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులకు దరఖాస్తు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డివిజన్ పరిధిలో చిల్‌పచెడ్ మండలంలో ఫైజాబాద్, బండపోతుగల్, కౌడపల్లి మండలంలో ధర్మాసాగర్, వెల్మకన్న, నర్సాపూర్ పట్టణంలోని 3 మండలాల్లోని పెద్దచింతకుంట, తుజాల్పుర్‌లో, శివ్వంపేట మండలం పిల్లుట్లలో డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఈ నెల 22 సా.5 గ.వరకు అవకాశం ఉందన్నారు.