భార్యను హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశాడు ఓ భర్త. అక్కన్నపేట మం. తారాచంద్ తండాలో ఈ దారుణం జరిగింది. ఇదే తండాకు చెందిన స్వామి ఆస్తిలో సగ భాగం మొదటి భార్యకు ఇస్తానంటూ రెండో భార్య మణెమ్మతో(40) గొడవ పడ్డాడు. కోపంతో కర్రతో తలపై కొట్టి చంపేశాడు. అనుమానం రాకుండా మృతదేహాన్ని అక్కన్నపేటలో పడేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.