సిద్దిపేట: ఈనెల 25 నుంచి మంత్రి హరీష్ పర్యటనలు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఆసుపత్రులను మంత్రి హరీశ్​ రావు తనిఖీలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి పర్యటనలు షురూ కానున్నాయి. ప్రతీ వారం రెండు హాస్పిటల్స్​ తో పాటు మెడికల్​ కాలేజీలను సందర్శించాలని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, మ్యాన్​ పవర్‌లపై ఆరా తీయనున్నారు. సందర్శనకు వెళ్లిన ఆసుపత్రుల్లోనే అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలపై చర్చించనున్నారు.