సంగారెడ్డి జిల్లాలో నేటి వాతావరణ సమాచారం

సంగారెడ్డి జిల్లాలో నేడు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక అధికారులు జారీ చేయలేదు. ఈ నెల 19వ తేదీ వరకు వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. శీతల గాలుల కారణంగా పలు జిల్లాలలో చలి తీవ్రంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీలు ,కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది.