వర్గల్: పాము కాటుతో యువకుడు మృతి

వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన కర్రే మహేష్ (27) నాచారంలోని పెట్రోల్ పంపులో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో జనరేటర్ ఆన్ చేద్దామని వెళ్లగా అప్పటికే జనరేటర్ లోపల ఉన్న పాము బటన్ నొక్కగానే చేతిపై కాటేసింది. దీంతో తోటి సిబ్బంది వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.