
జీడిమెట్ల: సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన కమలాకర్‌రెడ్డి(40) షాపూర్‌నగర్ ప్రాంతంలో హమాలీగా పనిచేస్తున్నాడు. లారీ నుంచి పేపర్ బండిళ్లను దింపుతుండగా ప్రమాదవశాత్తు ఓ బండిల్ కమలాకర్‌రెడ్డి ఛాతిపై పడింది. దీంతో అపస్మారకస్థితికి వెళ్లిన ఆయనను మెడివిజన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.