భూపాలపల్లి: మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు

-

భూపాలపల్లి జిల్లాలో నేడు జరగాల్సిన రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు అయింది. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాలకు రావాల్సి ఉండగా, అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మరోసారి మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news