ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బస్సులో తరలిస్తున్న 102 కిలోల గంజాయి ప్యాకెట్లు సూర్యపేట జిల్లా పోలీసులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎస్పి రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ఆరీఫ్ ఖాన్, షేక్ ఇర్షాద్ కిరణ్ రాంబో దీపక్ వినయ్ శైలేష్ గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు.