తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజక వర్గమైన కుప్పం లోనే సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కోసం ఇవాళ స్థలం పరిశీలించారు చంద్ర బాబు నాయుడు. కుప్పంలోని టిడిపి ఆఫీస్ ఎదుట 1.35 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు నాయుడు… అక్కడ రాబోయే దీపావళి పండుగ లోపల ఇంటి నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
వైసీపీ పార్టీ నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలోనే.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. చంద్రబాబు.. ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటాడని… టూరిస్ట్ లాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తారని చంద్రబాబు నాయుడిపై వైసీపీ పార్టీ నేతలు నిత్యం కామెంట్లు చేస్తుంటారు. అంతేకాదు.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. వీటన్నిటినీ బేరీజు వేసుకున్న చంద్రబాబు… కుప్పంలోనే ఇళ్లు కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.