నలగొండ: పరీక్షలు వాయిదా

కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిగ్రీ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి మిర్యాల రమేష్ తెలిపారు. డిగ్రీ ఐదో సెమ్, బీహెచ్ ఎంపీటీ రెండో సెమ్ ను కూడా వాయిదా వేసినట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలను వాయిదా వేశామని తిరిగి పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.